- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండో సినిమా రాకముందే పవీష్ మూడో ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం.. హీరోయిన్‌గా స్టార్ కిడ్!
ఈ రెండో సినిమా ఇంకా విడుదల కాకముందే, పవీష్ తన మూడో ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్ నారాయణ్ హీరోగా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. తన మొదటి సినిమా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’తోనే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. మొదటి చిత్రంతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో.. అదే జోష్‌తో వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పవీష్ తన రెండవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఇందులో ప్రముఖ ఫోక్ డ్యాన్సర్, యూట్యూబర్ నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ రెండో సినిమా ఇంకా విడుదల కాకముందే, పవీష్ తన మూడో ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ కథ చాలా కొత్తగా, వైవిధ్యంగా ఉండబోతోందని సమాచారం.
1980ల కాలం పీరియడ్ బ్యాక్‌డ్రాప్ నాటి పరిస్థితుల నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ వాలీబాల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుందట. ప్రముఖ తమిళ దర్శకుడు పా రంజిత్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన థాము, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో హీరోయిన్‌గా స్టార్ నటి, ప్రముఖ దర్శకుడు సుందర్ సి ఖుష్బూల గారాల పట్టి అవంతిక సుందర్ నటించబోతున్నట్లు టాక్. ప్రస్తుతం అవంతిక ‘ఆరంభం’ అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెడుతోంది. అయితే ఆ మలయాళ మూవీ రిలీజ్ కాకముందే, కోలీవుడ్‌లో పవీష్ లాంటి క్రేజీ హీరో సరసన మరో పెద్ద ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టి ఫుల్ ఫామ్‌లో ఉన్న పవీష్, స్టార్ కిడ్ అవంతికల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాపై అప్పుడే ఇండస్ట్రీలో మంచి అంచనాలు మొదలయ్యాయి.






