ఆ తేదీన థియేటర్లలోకి రానున్న ‘ఓయ్’

by Pulgam srinivas |

ఓయ్ చిత్రాన్ని జూలై 18వ తేదీన రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఆ తేదీన థియేటర్లలోకి రానున్న ‘ఓయ్’
X

దిశ, వెబ్ డెస్క్: సిద్ధార్థ్ మరియు శామిలి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఓయ్. 2009లో విడుదలైన ఈ సినిమా ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఆ తర్వాత కాలంలో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. కొంతకాలం క్రితం ఈ సినిమాను రీ-రిలీజ్ చేయగా, అద్భుతమైన రెస్పాన్స్‌ను ప్రేక్షకుల నుండి పొందింది. దీంతో ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాను జూలై 18వ తేదీన మళ్లీ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రీ-రిలీజ్‌లో మంచి స్పందన పొందిన ఈ సినిమా మరోసారి ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుందో అన్నది ఆసక్తిగా మారింది. ఆనంద్ రంగ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, డి.వి.వి దానయ్య నిర్మించారు.




Next Story