‘యుఫోరియా’ మూవీ రివ్యూ.. టీనేజ్ పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా!

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-06 09:19:02  IST  )

దర్శకుడు గుణశేఖర్(Gunasekhar) ఈసారి ఒక బలమైన సామాజిక అంశంతో తెరకెక్కిన ‘యుఫోరియా’మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

‘యుఫోరియా’ మూవీ రివ్యూ.. టీనేజ్ పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా!
X

దిశ, సినిమా: దర్శకుడు గుణశేఖర్(Gunasekhar) పౌరాణిక, చారిత్రక చిత్రాలు తీసి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు రూటు మార్చిన ఆయన ఈసారి ఒక బలమైన సామాజిక అంశంతో తెరకెక్కించిన ‘యుఫోరియా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భుమిక చావ్లా, సారా అర్జున్, గౌతమ్ మీనన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్‌లోకి వచ్చి పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంటోంది. ఇక ‘యుఫోరియా’ కథ విషయానికొస్తే. నగరంలోని ఒక ప్రముఖ కాలేజీ ప్రిన్సిపాల్ వింధ్య వేములపల్లి (భూమిక చావ్లా) తనపై తానే హైకోర్టులో కేసు వేసుకోవడం అనే ఆసక్తికరమైన పాయింట్‌తో సినిమా మొదలవుతుంది. అసలు ఆమె ఎందుకు నిందితురాలిగా నిలబడింది? నేటి తరం యువత స్వేచ్ఛను ఎలా దుర్వినియోగం చేస్తోంది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం. ముఖ్యంగా భూమిక చావ్లా నటన సినిమాకే హైలెట్‌గా నిలవడంతో పాటుగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

డెబ్యూ హీరో విఘ్నేష్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోగా, గౌతమ్ మీనన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సారా అర్జున్ స్క్రీన్ టైమ్ తక్కువైనా ఉన్నంతలో మెప్పించింది. సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఫస్టాఫ్ చాలా వేగంగా, ఆసక్తికరంగా సాగుతుంది. నేటి తరం పెంపకంలో తల్లిదండ్రులు చేసే పొరపాట్లను, యువత మితిమీరిన ప్రవర్తనను గుణశేఖర్ కళ్లకు కట్టినట్లు చూపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నారు. క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్స్ ఆలోచింపజేసేలా ఉంటాయి. అయితే, సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ పదే పదే రావడం ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తాయి. మొత్తానికి ‘యుఫోరియా’ ఒక మంచి సందేశం ఉన్న సోషల్ డ్రామా. సెకండ్ హాఫ్‌లో ల్యాగ్ ఉన్నప్పటికీ, సమాజానికి కావాల్సిన ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ సినిమా చర్చించింది. సోషల్ మెసేజ్ చిత్రాలను ఇష్టపడే వారు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు. ‘యుఫోరియా’ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందడంతో పాటు 3.5 రేటింగ్ దక్కించుకుంది.

‘రామాయణ’ మూవీలో మరో స్టార్ హీరో.. రికార్డులు షేకవ్వాల్సిందేనా!

Next Story