- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రామాయణ’ మూవీలో మరో స్టార్ హీరో.. రికార్డులు షేకవ్వాల్సిందేనా!
బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’(Ramayana) లో విజయ్ సేతుపతి.

దిశ, సినిమా: గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’(Ramayana) నుండి వస్తున్న అప్‌డేట్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో రూపొందుతోంది. ముఖ్యంగా నటీనటుల ఎంపిక విషయంలో దర్శకుడు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్టులోకి కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేసింది. రావణుడి పాత్రలో రాకింగ్ స్టార్ యష్ నటిస్తుండగా, ఆయనకు తమ్ముడు విభీషణుడి పాత్రలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi)కనిపించనున్నారని తెలుస్తోంది. అధర్మం వైపు నిలబడే అన్న రావణుడికి, ధర్మం కోసం ప్రాణాలైనా ఇచ్చే తమ్ముడు విభీషణుడికి మధ్య జరిగే పోరాటం ఈ సినిమాలో కీలక ఘట్టంగా ఉండబోతోందని టాక్. యష్(yash) అహంకారపూరిత నటనకు, విజయ్ సేతుపతి గంభీరమైన పర్ఫార్మెన్స్ తోడైతే వెండితెరపై రికార్డులు షేకవ్వాల్సిందే అని సినీ అభిమానులు భావిస్తున్నారు.
ఈ ఇద్దరు స్టార్స్ మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రానికే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. కేవలం నటీనటుల పరంగానే కాకుండా, సాంకేతిక పరంగా కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించబోతోంది. సుమారు రూ. 4,000 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ లెజెండ్ హాన్జ్ జిమ్మెర్ కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసం ఆస్కార్ గెలిచిన DNEG సంస్థ పనిచేస్తుండటం విశేషం. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా చిత్ర బృందం ఒక భారీ సర్ప్రైజ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ రోజున ప్రధాన పాత్రల ఫస్ట్ లుక్ లేదా టీజర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇక మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు.






