డ్రీమ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను: భూమి పెడ్నేకర్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-14 05:08:15  IST  )

నాకు అలాంటి మాస్ సినిమాలు పెద్దగా నచ్చవు, కానీ ‘ధురంధర్’ పార్ట్-1 మాత్రం నన్ను కట్టిపడేసింది.

డ్రీమ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను: భూమి పెడ్నేకర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ టాలెంటెడ్ నటి భూమి పెడ్నేకర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బి-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ చూసిన తర్వాత ఆమె ఆ సినిమాకు, అందులోని యాక్షన్‌కు ఫిదా అయిపోయారట. ఈ క్రమంలో దర్శకుడు ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్‌లతో కలిసి పనిచేయడం తన డ్రీమ్ అని ఆమె మనసులో మాట బయటపెట్టారు. సాధారణంగా తనకు అతిగా మాస్ ఎలిమెంట్స్ ఉండే సినిమాలు చూస్తే నిద్ర వస్తుందని, అలాంటి చిత్రాలతో తాను అస్సలు కనెక్ట్ కాలేనని భూమి నిజాయితీగా చెప్పారు. "నాకు అలాంటి మాస్ సినిమాలు పెద్దగా నచ్చవు, కానీ ‘ధురంధర్’ పార్ట్-1 మాత్రం నన్ను కట్టిపడేసింది. అందుకే ఆదిత్య ధర్ దర్శకత్వంలో నటించాలని ఉంది.

ఇక రణ్‌వీర్ సింగ్‌కు నేనో పెద్ద ఫ్యాన్‌ను, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఒకవేళ అవకాశం వస్తే.. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అవుతుంది" అని హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కేవలం సినిమాల గురించే కాకుండా, ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న 'ఓపెనింగ్ వీకెండ్' కలెక్షన్ల పిచ్చి గురించి కూడా భూమి ఆవేదన వ్యక్తం చేశారు. "నేను నా కెరీర్‌లో ఎక్కువగా 'స్లైస్ ఆఫ్ లైఫ్' (మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు) చిత్రాలే చేశాను. అలాంటి సినిమాలు మెల్లమెల్లగా ప్రజల్లోకి వెళ్లి హిట్ అవుతాయి. కానీ ఇప్పుడు శుక్రవారం కలెక్షన్లు రాగానే సినిమా బాగుందో లేదో అని జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. దీనివల్ల చిన్న సినిమాలు థియేటర్లలో నిలబడలేకపోతున్నాయి" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భూమి పెడ్నేకర్ ‘అధూరే హమ్ అధూరే తుమ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా చాన్నాళ్ల విరామం తర్వాత చాక్లెట్ బాయ్ ఇమ్రాన్ ఖాన్ మళ్లీ వెండితెరపైకి వస్తుండటం విశేషం.

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు: నటి అనసూయ ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్

Next Story