- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు: నటి అనసూయ ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్
నటి అనసూయపై అసభ్యకర AI వీడియోలు, పోస్టులు పెట్టిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వేదికగా లేడీ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్న వారిపై సైబరాబాద్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఫిర్యాదు మేరకు ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
AI వీడియోలతో వేధింపులు..
ఆంధ్రప్రదేశ్‌లోని కడప (Kadapa) జిల్లాకు చెందిన జనార్దన్ అనే వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. ఇతడు నటి అనసూయను ఉద్దేశించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అసభ్యకర వీడియోలను రూపొందించి, సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్ట్ చేశాడు. దీనిపై అనసూయ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మరో కేసులో ఆటో డ్రైవర్ అరెస్ట్..
మరో ఘటనలో, అనసూయ అప్‌లోడ్ చేసిన 'రీల్' పై అసభ్యకరమైన కామెంట్ చేసిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు గుర్తించి జైలుకు పంపారు. సోషల్ మీడియాలో హద్దులు మీరు ప్రవర్తించే వారిపై నిఘా ఉందని, ఎవరైనా మహిళల గౌరవానికి భంగం కలిగించేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.






