- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anchor Manjusha: పల్చటి చీరలో అందమైన నవ్వుతో ఆకట్టుకుంటున్న క్యూట్ యాంకర్
తాజాగా ఈ బ్యూటీ తన 'ఇన్ స్టా'లో పలుచటి లైట్ బ్లూ కలర్ శారీని కట్టుకొని, అందుకు తగిన బ్లౌజ్ ధరించి అందమైన నవ్వుతో ఫోటోలకు ఫోజులిచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: సినిమాల ద్వారా కెరీర్ను మొదలుపెట్టి తక్కువ రోజుల్లోనే మంచి గుర్తింపును సంపాదించుకొని, ఆ తర్వాత యాంకరింగ్ రంగం వైపు అడుగులు వేసిన వారిలో మంజూష ఒకరు. ఈమె చాలా సంవత్సరాల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ఇలియానా, చార్మి హీరోయిన్లుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన రాఖీ చిత్రంలో 'ఎన్టీఆర్'కు చెల్లెలి పాత్రలో నటించింది.
ఈ చిత్రంలో ఈమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండడం, ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడం, ఇందులో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో చాలా మంది ఈ బ్యూటీ వరుస పెట్టి తెలుగు సినిమాల్లో నటిస్తోంది అని అనుకున్నారు.
కానీ రాఖీ చిత్రం తర్వాత ఈ నటి పెద్దగా సినిమాల్లో నటించలేదు. ఆ తర్వాత యాంకరింగ్ రంగంపై దృష్టి పెట్టడం మొదలు పెట్టింది. అందులో భాగంగా చాలా సంవత్సరాలుగా యాంకర్ గానే కొనసాగుతుంది. ప్రస్తుతం తెలుగులో ఉన్న బెస్ట్ యాంకర్లలో ఒకరిగా మంజూష కెరీర్ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం మంజూష వరుస పెట్టి సినిమా ఈవెంట్లకు యాంకర్గా వ్యవహరిస్తుంది.
ఈమె ఏదైనా ఈవెంట్కు వెళ్లినప్పుడు అందరినీ ఆకర్షించే విధంగా డ్రెస్ వేసుకుంటూ ఉంటుంది. దాంతో ఈవెంట్లో ఈమె స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. దాంతో ఈమెకు సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ సంఖ్య భారీగానే ఉంది.
తాజాగా ఈ బ్యూటీ తన 'ఇన్ స్టా'లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో మంజూష పలుచటి లైట్ బ్లూ కలర్ శారీని కట్టుకొని, అందుకు తగిన బ్లౌజ్ ధరించి అందమైన నవ్వుతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇందులో ఈమె సూపర్ లుక్లో ఉండడంతో మంజూషకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.






