మంత్రి దామోదర్ ఇంటి ముట్టడికి యత్నం..అడ్డుకున్న పోలీసులు

by Taduka Kalyani |

ఐకెపి వివోఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆందోళన చేపట్టారు.

మంత్రి దామోదర్ ఇంటి ముట్టడికి యత్నం..అడ్డుకున్న పోలీసులు
X

దిశ,సంగారెడ్డి అర్బన్: ఐకెపి వివోఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆందోళన చేపట్టారు. పిఎస్ ఆర్ గార్డెన్ నుండి ర్యాలీగా బయలుదేరి మంత్రి దామోదర్ ఇంటి ముట్టడికి దగ్గర్లోకి రాగానే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి. సాయిలు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వం అధికారంలోకి వస్తే కనీస వేతనం, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు దాటినా నేటికీ అమలు కావడం లేదని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసే దాంట్లో, అధికారులు ప్రజాప్రతినిధులు నిర్వహించే సభలు జయప్రదం చేసే దాంట్లో వివోఏల పాత్ర కీలకమన్నారు. ముఖ్యమంత్రి ఏ సభ జరగాలన్నా వివోఏలు లేనిదే సమీకరణ జరగదని తెలియజేశారు. కష్టపడి పనిచేస్తున్న మహిళలను అభివృద్ధి చేసే దాంట్లో రుణాలు ఇప్పించి రికవరీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వం మాత్రం వివోఏలను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. నగేష్ మాట్లాడుతూ.. వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వివోఏలకు వేతనాలు పెంచకపోతే రాబోయే కాలంలో తాడోపేడో కోసం హైదరాబాద్ వస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం. యాదగిరి, బి. మంజుల, యూనియన్ నాయకులు ఆంజనేయులు, అనిత, భాగ్యలక్ష్మి, ప్రవీణ్, మల్లన్న, సంజీవ్, కాజా, విజయలక్ష్మి, శశిరేఖ, అమృత లక్ష్మి, రేణుక తో పాటు వివోఏలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మంత్రి పిఏకు వినతిపత్రం అందజేశారు.

Next Story