స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి: బీజేపీ నేతలకు పార్టీ చీఫ్ పిలుపు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. సర్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎన్నిలకు వెళ్లేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది...

స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి: బీజేపీ నేతలకు పార్టీ చీఫ్ పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. సర్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎన్నిలకు వెళ్లేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో నేతలు, కార్యకర్తలను రాష్ట్ర బీజేపీ సమాయత్తం చేస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే సూచనలు చేసింది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా స్థానిక ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

సిద్ధంగా ఉండండి..

అమరావతిలో రాష్ట్ర సంస్థాగత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానిక ఎన్నికలకు పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నేతలకు అవకాశం ఇస్తామని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లు అన్ని వనరులు సమకూర్చుకోవాలని సూచించారు. పార్టీ నేతలెవరైనా సరే ఎక్కడ పోటీ చేయమంటే అక్కడే పోటీ చేయాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ ఆదేశించారు. ఎన్నికల రణరంగంలోకి దిగేలా నేతలు, కార్యకర్తలు రెడీ ఉండాలని పిలుపునిచ్చారు.న

Next Story