- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్స్యకారుల మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రులు దిగ్భ్రాంతి : కలెక్టర్‌కు ఆదేశాలు
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో ముగ్గురు గిరిజన మహిళలు సహా ఐదుగురు గల్లంతై, మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో ముగ్గురు గిరిజన మహిళలు సహా ఐదుగురు గల్లంతై, మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోదావరి నదిలో చేపలవేటకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారన్న విషయంపై సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గొమ్ముకొత్తగూడెంనకు చెందిన తుర్రం భారతి, ఊకే సుశీల, ఊకే లక్ష్మి, బాసిబోయిన బాలరాజు, ఊకే రమేష్ అనే ఐదుగురు నదిలో వేటకు వెళ్లి మరణించినట్లుగా తెలిపారు. ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం.. వారి కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హోంమంత్రి అని ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే బాధితుల కుటుంబాలకు తక్షణ సహాయం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.






