- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలి
జిల్లాలోని అన్ని రేషన్ కార్డుదారులు తమ రేషన్ కార్డులకు సంబంధించి ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి వి. బాలరాజు తెలిపారు.

దిశ, నారాయణపేట ప్రతినిధి : జిల్లాలోని అన్ని రేషన్ కార్డుదారులు తమ రేషన్ కార్డులకు సంబంధించి ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి వి. బాలరాజు తెలిపారు. రేషన్ కార్డులో నమోదైన ప్రతి సభ్యుడు తప్పనిసరిగా సమీపంలోని చౌకధరల దుకాణానికి వెళ్లి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని సభ్యులకు భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రేషన్ సేవల కొనసాగింపులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు లేదా ఇతర కారణాల వల్ల స్వయంగా చౌకధరల దుకాణానికి హాజరు కాలేని వారి వివరాలను సంబంధిత చౌకధరల దుకాణ డీలర్‌కు ముందస్తుగా తెలియజేయాలని సూచించారు. అలాంటి అర్హుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతుందని తెలిపారు. జిల్లాలోని రేషన్ కార్డుదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వ సేవలను నిరంతరాయంగా పొందాలని జిల్లా పౌరసరఫరాల అధికారి వి. బాలరాజు విజ్ఞప్తి చేశారు.






