- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘డ్రాగన్’ నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా ఉండబోతోంది: రుక్మిణి వసంత్
‘సప్తసాగరాలు దాటి’ సినిమాతో ఊహించని ఫాలోయింగ్ రాబట్టుకుని క్రేజీ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది.

దిశ, సినిమా: ‘సప్తసాగరాలు దాటి’ సినిమాతో ఊహించని ఫాలోయింగ్ రాబట్టుకుని క్రేజీ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఒక్క ప్రాజెక్ట్‌తోనే తనకంటూ ప్రత్యేక ఫేమ్ రాబట్టుకున్న యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth). తెలుగు, తమిళ, కన్నడ మలయాల భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ హిట్ తన ఖాతాలో వేసుకుంటుంది. ఇటీవల ‘కాంతార: చాప్టర్1’ మూవీతో వచ్చిన ఈ భామ సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) సరసన ‘డ్రాగన్’(Dragon)మూవీలో నటించనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా, రుక్మిణి వసంత్ హీరో యష్ ‘టాక్సిక్’లోనూ కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు విషయాలు పంచుకుంది. ప్రస్తుతం నేను ఎన్టీఆర్ గారి ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’ లో నటిస్తున్నాను. ఈ సినిమా నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా ఉండబోతోందని చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి పవర్‌ఫుల్ స్టార్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం నిజంగా గర్వంగా, ఆనందంగా అనిపిస్తుందని చెప్పింది. ఇందులో నా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండబోతుందని, ప్రేక్షకులు తప్పకుండా నన్ను కొత్త కోణంలో చూస్తారని ఆశిస్తున్నానని అంచనాలు పెంచింది.
అలాగే తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి చెప్తూ.. ఇతర సినిమాల గురించి వివరాలు వెల్లడించలేను. ముఖ్యంగా ‘టాక్సిక్’ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. కానీ మేకర్స్ నిర్ణయం ప్రకారం, నేను ఏమీ చెప్పకూడదు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు అధికారికంగా అన్ని విషయాలు తెలియజేస్తాం. ఆ వరకు కొంచెం ఓపిక పట్టాలని కోరింది. త్వరలోనే నా రాబోయే సినిమాల గురించి పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తాను. మీ ప్రేమ, మద్దతే నాకు అతిపెద్ద బలమని పేర్కొంది.
Related News : శివాజీ గారు చెప్పిన పాయింట్ కరెక్టే కానీ వాడిన భాష చండాలం.. సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్






