- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివాజీ గారు చెప్పిన పాయింట్ కరెక్టే కానీ వాడిన భాష చండాలం.. సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ యాక్టర్ శివాజీ దండోర ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యాక్టర్ శివాజీ దండోర ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది. అలా కాకుండా అభ్యంతరకరంగా (సామాన్లు కనిపించేలా) బట్టలు వేసుకుంటే అందులో విలువేముంటుంది? అంటూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఇప్పటికే శివాజీ క్షమాపణలు కూడా తెలియజేశాడు. అలాగే ప్రెస్ మీట్ కూడా పెట్టి తన స్పీచ్‌పై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు శివాజీ. అయితే అతను చేసిన వ్యాఖ్యలకు కొంతమంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది మాత్రం అతను చెప్పిన పాయింట్ కరెక్ట్ కానీ వాడిన భాష కరెక్ట్ కాదు అని అతనికి సపోర్టుగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కూడా ఈ ఇష్యూ పై స్పందించింది. జబర్దస్త్ వర్ష నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్ షోకు తాజాగా ఇంద్రజ గెస్టుగా వెళ్లారు. అక్కడ ఇదే విషయం గురించి ఆమెను వర్ష అడుగుగా ఆమె స్పందించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘నువ్వు ఒక డ్రెస్సు వేసుకుని పబ్లిక్‌లో వచ్చి లేదా సోషల్ మీడియాలో పెట్టినప్పుడు నీ డ్రెస్ కరెక్ట్ కానప్పుడు, అభ్యంతరకరంగా ఉన్నప్పుడు దాని గురించి కామెంట్స్ చేసే హక్కు, మాట్లాడే హక్కు వాళ్ళకి ఉంటుంది కదా. నేను చెప్పేది ఏంటంటే పబ్లిక్ డెకారమ్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఇంట్లో వాళ్లతో, ఫ్రెండ్స్‌తో మాట్లాడినట్టు బయట పబ్లిక్‌లో మాట్లాడము.. మాట్లాడకూడదు. అక్కడ మనం ఒక డెకారమ్ మైంటైన్ చేయాలి. అలాగే కాస్ట్యూమ్స్ విషయంలో, వేసుకునే డ్రెస్సు విషయంలో కూడా ఒక కోడ్ ఉంటుంది.
అలా కాకుండా ఇది నా ఇష్టం అనుకుంటే ఓకే కానీ నువ్వు ఎవరు అడగడానికి అని అనడానికి అక్కడ లేదు స్పేస్.. ఎందుకంటే పబ్లిక్‌లో వచ్చినప్పుడు కొంచెం డీసెంట్‌గా ఉండాలి. అలాగే శివాజీ గారు చెప్పిన పాయింట్ కరెక్ట్. కానీ వాడిన భాష చండాలం. మీరు ఇంట్లో మీకు కంఫర్టబుల్‌గా ఏమి వేసుకున్నా, ఎలా ఉన్నా ఎవ్వరూ అడగరు, తప్పుబట్టరు. కానీ బయటకు, పబ్లిక్ ఫంక్షన్స్‌కు వచ్చేటప్పుడు కొంచెం నీట్‌గా వస్తే మీకే మర్యాద. మన సంస్కృతికి మనం గౌరవం ఇవ్వటంలో మన సంస్కారం పెరుగుతుంది అంతే అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్స్ ఇంద్రజ కరెక్టు మాట్లాడింది అంటూ ఆమెతో ఏకీభవిస్తున్నారు.
Related News : ‘డ్రాగన్’ నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా ఉండబోతోంది: రుక్మిణి వసంత్
నాగచైతన్యకు బిగ్ షాకిచ్చిన శోభిత.. చర్చనీయాంశంగా మారిన కామెంట్స్!






