‘సన్నదనం వెనుక పరిగెత్తొద్దు’.. బిపాస బసు షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-09 03:04:05  IST  )

బాలీవుడ్‌లో ఒకప్పుడు గ్లామర్‌కే కాదు, ఫిట్‌నెస్‌కు కూడా ట్రెండ్‌సెటర్‌గా నిలిచింది నటి బిపాషా బసు(Bipasha Basu).

‘సన్నదనం వెనుక పరిగెత్తొద్దు’.. బిపాస బసు షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో ఒకప్పుడు గ్లామర్‌కే కాదు, ఫిట్‌నెస్‌కు కూడా ట్రెండ్‌సెటర్‌గా నిలిచింది నటి బిపాషా బసు(Bipasha Basu). ప్రస్తుతం సినిమాలకు కొంత దూరంగా ఉన్నా.. ఆమె ఆలోచనలు మాత్రం ఇప్పటికీ యువతను ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బిపాషా, ఫిట్‌నెస్‌పై తనదైన స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చి అందరినీ ఆలోచింపజేసింది. ఇప్పటికీ చాలామంది ఫిట్‌నెస్ అంటే సన్నగా మారడమేనని భావిస్తుంటారు. కానీ ఈ ఆలోచన పూర్తిగా తప్పని బిపాస స్పష్టంగా చెప్పింది. నిజమైన ఫిట్‌నెస్ అంటే కేవలం బరువు తగ్గడం కాదని, శరీరం లోపల నుంచి బలంగా మారడమే అసలైన ఆరోగ్యమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. మానసిక ప్రశాంతత, శారీరక శక్తి, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కలిసినప్పుడే నిజమైన ఫిట్‌నెస్‌ను అనుభవించగలమని బిపాస తెలిపింది.

స్కేల్‌పై కనిపించే నంబర్లు మన ఆరోగ్యాన్ని నిర్ణయించవని, మన శక్తి స్థాయి, స్టామినా, ఫ్లెక్సిబిలిటీ ఎంతో ముఖ్యమని వివరించింది. ఒకప్పుడు ‘సైజ్ జీరో’ ట్రెండ్ ఇండస్ట్రీని ఊపేసినప్పటికీ, ఆ రేసులో తాను ఎప్పుడూ పరుగెత్తలేదని బిపాస చెప్పుకొచ్చింది. సన్నబడటం కంటే స్ట్రాంగ్‌గా ఉండటానికే తాను ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చానని తెలిపింది. జిమ్ వర్కౌట్స్, వెయిట్ ట్రైనింగ్, యోగా, ఫంక్షనల్ ఎక్సర్‌సైజ్‌లను తన డైలీ లైఫ్‌లో భాగం చేసుకున్నానని వెల్లడించింది. “స్ట్రాంగ్ ఇజ్ సెక్సీ” అనే మాటను నిజ జీవితంలో అమలు చేసిన సెలబ్రిటీల్లో బిపాస ముందుంటుంది. ఫిట్‌నెస్ అనేది ఇతరులను మెప్పించడానికి కాదు, మన జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా గడపడానికి అని ఆమె నొక్కి చెబుతోంది. సన్నగా కనిపించాలనే ఒత్తిడితో శరీరాన్ని హింసించుకోవద్దని, బలం, ఆరోగ్యం, ఆత్మసంతృప్తిని ఇచ్చే ఫిట్‌నెస్‌ను ఎంచుకోవాలని యువతకు బిపాస ఇచ్చిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More..

మగవాళ్ళను కుక్కలతో పోల్చిన కన్నడ నటి రమ్య

Next Story