- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మగవాళ్ళను కుక్కలతో పోల్చిన కన్నడ నటి రమ్య
కన్నడ సినీ నటి, మాజీ ఎంపీ దివ్య స్పందన(రమ్య) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

దిశ, వెబ్ డెస్క్ : కన్నడ సినీ నటి, మాజీ ఎంపీ దివ్య స్పందన(రమ్య) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. 'వీధి కుక్కలు ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటాయో తెలియదు, ఎప్పుడు కరుస్తాయో తెలియదు, వాటిని షెల్టర్ హోమ్స్ కు తరలించాలి' అని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రమ్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. "కుక్క మనసు చదవలేకపోతే మగవాడి మనసు కూడా చదవలేం. ఎప్పుడు రేప్ చేస్తాడో, హత్య చేస్తాడో తెలియదు కదా… అలాంటపుడు అందరు మగవాళ్లను జైల్లో పెట్టాలా?" అంటూ సర్కాస్టిక్‌గా పోస్ట్ పెట్టారు.
అయితే రమ్య సుప్రీంకోర్టు లాజిక్‌ను ప్రశ్నించాలనుకున్నప్పటికీ, మగవాళ్లను కుక్కలతో పోల్చినట్లు ఉందని పలువురు నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. మరోవైపు, ఇది కేవలం విమర్శ మాత్రమేనని, జంతు ప్రేమికురాలిగా వీధి కుక్కలను తరలించడాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారనే అభిప్రాయాన్ని మరి కొందరు వ్యక్తం చేశారు.






