నన్ను లేడీ సూపర్ స్టార్ అనకండి.. ఆ బిరుదుకు ఆమె మాత్రమే అర్హురాలు: శ్రీలీల

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-11 08:19:34  IST  )

నా దృష్టిలో లేడీ సూపర్ స్టార్ అంటే కేవలం నయనతార గారే. ఆమె నాకు రోల్ మోడల్. నన్ను ఆ పేరుతో పిలవడం సరికాదు

నన్ను లేడీ సూపర్ స్టార్ అనకండి.. ఆ బిరుదుకు ఆమె మాత్రమే అర్హురాలు: శ్రీలీల
X

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు దక్కక కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు సరికదా, టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా భారీ ఆఫర్లు అమ్మడిని వరిస్తున్నాయి. ఈక్రమంలో.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల తన కెరీర్, వైఫల్యాలు, తన వ్యక్తిగత ఇష్టాఇష్టాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనను ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలవడంపై శ్రీలీల స్పందిస్తూ, ఆ బిరుదును తాను అంగీకరించనని స్పష్టం చేసింది. "నా దృష్టిలో లేడీ సూపర్ స్టార్ అంటే కేవలం నయనతార గారే. ఆమె నాకు రోల్ మోడల్. నన్ను ఆ పేరుతో పిలవడం సరికాదు" అని చెప్పింది. ఇక తన సినీ ప్రయాణం వెనుక తన తల్లి ప్రోత్సాహం ఎంతో ఉందని, అసలు తాను వైద్య వృత్తిని ఎంచుకుని ప్రజలకు సేవ చేయాలనుకున్నానని, కానీ అనుకోకుండా నటిని అయ్యానని వెల్లడించింది.

వరుస పరాజయాల గురించి మాట్లాడుతూ.. "జీవితంలో జయాపజయాలు సహజం. నాకు అపజయం ఎదురైతే కేవలం ఒక గంట సేపు మాత్రమే ఏడ్చి బాధపడతాను. ఆ తర్వాత మళ్ళీ వెంటనే నా పనిలో నిమగ్నమైపోతాను" అని తన పాజిటివ్ దృక్పథాన్ని చాటి చెప్పింది. ప్రస్తుతం తాను హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నానని, సినిమాకు భాషా భేదం లేదని ఆమె అభిప్రాయపడింది. ఇక చెన్నై అంటే తనకు ఎంతో ఇష్టమని, అక్కడి యువత, దోస అంటే తనకు చాలా క్రేజ్ అని శ్రీలీల చెప్పుకొచ్చింది. నయనతార లాగే తాను కూడా చెన్నైలో పెళ్లి చేసుకుంటానా? అనేది ప్రస్తుతానికి తెలియదని నవ్వుతూ బదులిచ్చింది. తన వ్యక్తిగత భయాల గురించి చెబుతూ.. తనకు విమానం ల్యాండ్ అయ్యే సమయంలో చాలా భయంగా ఉంటుందని, క్షేమంగా కిందకు దిగిన తర్వాత పైలట్, సిబ్బందికి షేక్ హ్యాండ్ ఇచ్చి ధన్యవాదాలు చెప్పాలని తన తల్లి చెప్పిందని ఇప్పటికీ అదే పద్ధతిని పాటిస్తున్నట్లు మనసులోని మాటను పంచుకుంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More.. జాక్ పాట్ కొట్టిన త్రిష.. మల్టీస్టారర్‌లో రూ.12కోట్ల బంపర్ ఆఫర్!

Next Story