పాన్ ఇండియా స్టార్ Prabhas తో ఒక్కసారి కూడా నటించని ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

by Disha Web Desk 6 |
పాన్ ఇండియా స్టార్ Prabhas తో ఒక్కసారి కూడా నటించని ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ షుల్ బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్‌తో ‘కల్కీ’, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా .. సందీప్ వంగ డైరెక్షన్ లో మరో సినిమా ప్రభాస్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో డార్లింగ్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ప్రభాస్ బాలీవుడ్‌లో, టాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేశారు. కానీ ఓ స్టార్ హీరోయిన్‌తో మాత్రం ఇప్పటి వరకు ఒక్క మూవీ కూడా చేయలేదట. టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ సమంత దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది. కానీ, ప్రభాస్, సామ్ కాంబినేషన్‌లో ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో ఈ ఇద్దరు స్టార్స్ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారట. వారికి కోరికను మేకర్స్ ఎప్పుడు నెరవేరుస్తారో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి : Mahesh Babu - SS Rajamouli సినిమా.. ఈ హాలీవుడ్ యాక్టర్స్‌ను ప్రాజెక్ట్‌లోకి తీసుకుంటున్న జక్కన్న..



Next Story

Most Viewed