Mahesh Babu - SS Rajamouli సినిమా.. ఈ హాలీవుడ్ యాక్టర్స్‌ను ప్రాజెక్ట్‌లోకి తీసుకుంటున్న జక్కన్న..

by Disha Web Desk 9 |
Mahesh Babu - SS Rajamouli  సినిమా.. ఈ హాలీవుడ్ యాక్టర్స్‌ను ప్రాజెక్ట్‌లోకి తీసుకుంటున్న జక్కన్న..
X

దిశ, సినిమా : ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జక్కన్న చేయబోతున్న ప్రాజెక్ట్‌ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. మహేష్ బాబు హీరోగా రాబోతున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ సమకూరుస్తుండగా.. ఆఫ్రికా బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్-అడ్వెంచర్‌గా రాబోతున్నట్లు రాజమౌళి తండ్రి ఇంతకు ముందుకు తెలిపాడు. అయితే తాజాగా ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్స్ నటించబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇందుకోసం హాలీవుడ్ టాలెంట్ ఏజెన్సీ CAA కాస్టింగ్ చేయనుండగా.. జక్కన్న ఇప్పటికే అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. పాపులర్ హాలీవుడ్ స్టార్ క్రిస్ హెమ్స్‌వర్త్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు గతంలో వార్తలు రాగా విజయేంద్ర ప్రసాద్ చెప్పిన ఈ మాటలతో కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అభిమానులు. మొత్తానికి ఈ పాన్ వరల్డ్ ఫిల్మ్ అంచనాలకు మించి ఉండబోతుందనేది మాత్రం అర్థమవుతుంది అంటున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి :

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఒక్కసారి కూడా నటించని ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

చంద్రుడిపై స్థలం కొన్న స్టార్ హీరోలు వీరే.. బోలెడన్ని లాభాలు.. కోట్లకు కోట్లు..

Next Story

Most Viewed