డైరెక్టర్ Puri Jagannath క్రియేటివ్ గా ఆలోచించడానికి ఏం చేస్తాడో తెలుసా..

by Disha Web |
డైరెక్టర్ Puri Jagannath క్రియేటివ్ గా ఆలోచించడానికి ఏం చేస్తాడో తెలుసా..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెకర్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడపుతున్నారు. ఈ సినిమా విజయ్ దేవరకొండ, అనన్యపాండే కాంబోలో ఆగస్టు 25న థియేటర్లలో విడుదల అవనుంది. కాగా ప్రమోషన్స్ లో భాగంగా పూరీ, సుకుమార్ ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుకుమార్ అడిగిన ప్రశ్నలకు పూరీ ఆసక్తికర సమధానాలు ఇచ్చారు. డైరెక్టర్స్ కు ఆల్కహాల్ ఎంత వరకు అవసరం అంటారు? అని సుకుమార్ అడగ్గా.. నేను చిన్నప్పటి నుంచి సిగరెట్ కు అలవాటు పడ్డాను అని అన్నారు కానీ మందు గురించి మాట్లాడలేదు. క్రియేటివ్ గా ఆలోచించే వాళ్ళ బాడీ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, స్వీట్స్ కోరుకుటుంది. అందుకే నికోటిన్ కావాలనిపిస్తుంది. నేను సిగరెట్ ఎక్కువగా తాగుతాను అని పూరీ వెల్లడించారు. మరి మీకు ఏ అలవాటు ఉంది అని సుకుమార్ ని పూరీ ప్రశ్నించగా.. నేను ఎక్కువగా స్వీట్స్ తింటాను అని సుకుమార్ తెలిపారు.

Liger కు ఆల్ ది బెస్ట్ చెప్పిన బాహుబలి బ్యూటీ


Next Story