Liger కు ఆల్ ది బెస్ట్ చెప్పిన బాహుబలి బ్యూటీ

by Disha Web Desk 7 |
Liger కు ఆల్ ది బెస్ట్ చెప్పిన బాహుబలి బ్యూటీ
X

దిశ, సినిమా : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన పాన్‌ ఇండియా మూవీ 'లైగర్‌'. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ భారీగా అంచనాలు పెంచేయగా సినిమా ఈ గురువారం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో స్పందిస్తున్న పలువురు సినీ ప్రముఖులు 'లైగర్' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఆకాంక్షిస్తున్నారు. రీసెంట్‌గా స్టార్‌ హీరోయిన్‌ అనుష్క ఈ మూవీ టీమ్‌కు సోషల్‌ మీడియా వేదికగా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది. ఇక ఆమె పోస్ట్‌కు రిప్లయ్ ఇచ్చిన విజయ్‌.. 'థాంక్యూ సోమచ్‌ స్వీటీ. అర్జున్‌ రెడ్డి సినిమా రిలీజ్ టైమ్‌లో కూడా ఇలాగే విషెస్‌ తెలిపారు. ఆ చిత్రం వలె 'లైగర్‌' కూడా సూపర్‌ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను' అని పేర్కొన్నాడు. మెత్తానికి రేపటికల్లా ఈ సినిమా భవితవ్యం ఏంటో తేలిపోనుంది.

కొడాలి నానిపై కాలేసిన Jr. NTR.. ఫొటో వైరల్..


Next Story

Most Viewed