Amala Akkineni : అమలకు ఉన్న వ్యాధి ఆడాళ్లందరికీ ఉంటే బాగుండు.. నెటిజన్స్ కాంట్రవర్సీ కామెంట్స్

by Disha Web Desk 7 |
Amala Akkineni : అమలకు ఉన్న వ్యాధి ఆడాళ్లందరికీ ఉంటే బాగుండు.. నెటిజన్స్ కాంట్రవర్సీ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న ఆమె.. నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా చిత్ర పరిశ్రమకు దూరమైందనే చెప్పాలి. అయితే కొన్నాళ్ల తర్వాత ‘మనం’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా అమల గురించి నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..

అమలకు వేల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ ఆమె మెడలో తులం బంగారం కూడా కనిపించదు. అంతేకాకుండా ఆమె కేవలం ఒక నల్లపూసల తాడు మాత్రమే ధరిస్తుంది. అమల బంగారం వేసుకోకపోవడానికి ఓ బలమైన కారణం ఉందట. అమలకు ఓ ఆరోగ్య సమస్య ఉందట. అదే స్కిన్ అలర్జీ. మెడలో లేక చేతులకు బంగారం వేసుకుంటే రేషస్ వస్తాయట. అంతే కాకుండా చర్మం మొత్తం ఎర్రగా మారిపోతుందట. అందుకనే అమల ఒంటిపై బంగారం ధరించరట. ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో.. దీనిపై నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ‘సింపుల్‌గా న్యాచురల్ బ్యూటీ.. ఆమెకు బంగారం అవసరం లేదు, ఎందుకంటే అమలనే పెద్ద బంగారం’’ అని కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొందరు అయితే ఈ వ్యాధి ఆడవారి అందరికీ ఉంటే బాగుండు భర్తలకు ప్రెస్టేషన్ తగ్గుతుంది అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.

Read more:

అత్యాచార నిందితుడికి ప్రభుత్వ మద్ధతా? దేశం సిగ్గుపడుతోంది

శ్రద్ధా క్యారెక్టర్‌పై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వద్దన్నా ఫోన్ చేస్తుందట

నెక్ట్స్ సీఎం పవన్ కళ్యాణే.. నటుడు సంచలన కామెంట్స్ (వీడియో)



Next Story

Most Viewed