విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా?

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-23 09:16:13  IST  )

బంధుమిత్రుల మధ్య ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)- రష్మిక మందన్న(Rashmika Mandanna) ఏడడుగులు వేయబోతున్నారు.

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)- రష్మిక మందన్న(Rashmika Mandanna)ల పెళ్లిపై గత కొన్నేళ్లుగా నడుస్తున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని చెబుతూ వచ్చిన ఈ జంట, ఇప్పుడు తమ బంధాన్ని వివాహంతో అధికారికం చేయబోతున్నారు. ఈ విషయంపై ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. తమ పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి ‘విరోష్’ (ViRash) అనే పేరుతో తమ బంధాన్ని కొత్తగా నామకరణం చేస్తూ, వివాహానికి సిద్ధమయ్యారు. రాజస్థాన్ వేదికగా జరగనున్న ఈ వేడుక ఇప్పుడు ఇండియాలోనే హాట్ టాపిక్‌గా మారింది. రాజస్థాన్‌లోని ఒక పురాతన ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా, పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల మధ్య ఫిబ్రవరి 26న వీరిద్దరూ ఏడడుగులు వేయబోతున్నారు. ఇప్పటికే ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ పేరుతో వీరు చేసిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.

‘గీత గోవిందం’తో మొదలైన వీరి పరిచయం, ‘డియర్ కామ్రేడ్’తో గాఢమైన ప్రేమగా మారి, ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కాబోతుండటం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పెళ్లి వార్త బయటకు వచ్చినప్పటి నుంచి నెటిజన్లు వీరిద్దరి గురించి రకరకాల విషయాలను ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య ఉన్న వయసు తేడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండ: మే 9, 1989లో జన్మించారు (36 ఏళ్లు). రష్మిక మందన్న: ఏప్రిల్ 5, 1996లో జన్మించారు (29 ఏళ్లు). దీని ప్రకారం వీరిద్దరి మధ్య దాదాపు 7 ఏళ్ల వయసు తేడా ఉంది. ఈ ఏజ్ గ్యాప్ గురించి సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వస్తున్నప్పటికీ, ప్రేమకు వయసుతో సంబంధం లేదని, వారిద్దరి కెమిస్ట్రీ సూపర్ అంటూ అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.

Invitation: విజయ్ - రష్మిక వివాహం.. టీపీసీసీ చీఫ్‌కు అందిన ఆహ్వానం

Next Story