- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Invitation: విజయ్ - రష్మిక వివాహం.. టీపీసీసీ చీఫ్‌కు అందిన ఆహ్వానం
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ ఆహ్వాన పత్రికను ఆయన బాబాయ్, రోహిన్ రెడ్డితో కలిసి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కు అందజేశారు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందన (Rashmika Mandanna) వివాహంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెళ్లి సందడి మొదలవ్వగా, ప్రముఖులను ఆహ్వానించే ప్రక్రియ ఊపందుకుంది. తాజాగా, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను విజయ్ దేవరకొండ బాబాయ్, రోహిన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయ్ – రష్మికల వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేసి, వేడుకకు తప్పకుండా హాజరుకావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు.
కాగా, ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ (Udaypur)లో విజయ్-రష్మిక వివాహం అత్యంత సన్నిహితుల మధ్య జరగనుంది. అభిమానులు తమ పేర్లను కలిపి పెట్టిన ‘విరోష్’ అనే పేరుతోనే ఈ జంట తమ వివాహ వేడుకను జరుపుకుంటున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ఉదయపూర్ వివాహం అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో చిత్ర పరిశ్రమకు, రాజకీయ ప్రముఖులకు భారీ రిసెప్షన్ కూడా ప్లాన్ చేసినట్లుగా సమాచారం.






