- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Pawan Kalyan ఫ్యాన్స్‌పై డైరెక్టర్ ఫైర్.. వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారంటూ అసహనం
దిశ, వెబ్‌డెస్క్: ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు చేస్తూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా గడుపుతున్నారు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ వంటి సినిమాలు ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే 50శాతం షూటింగ్ పూర్తయిందన్న విషయం తెలిసి సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ హరీశ్ శంకర్‌కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు.
అభిమానుల హెచ్చరికలపై మరో ట్విట్టర్ ఖాతా నుంచి మరి కొందరు ఫ్యాన్స్ కీలక మెసేజ్ చేశారు. ‘‘పవన్ కళ్యాణ్ ఇస్తున్న డేట్స్‌లో, కేటాయిస్తున్న అతి కొద్ది సమయంలో ప్రతిక్షణం సద్వినియోగం చేస్తూ సినిమా తీస్తున్న దర్శకులను మెచ్చుకోవడం మాని, వారినే మాటలు అనడం సబబు కాదు.’’ పేర్కొన్నారు. దీనికి డైరెక్టర్ హరీశ్ శంకర్ స్పందిస్తూ.. ‘‘రియల్ ఫ్యాన్స్ ఎప్పుడూ మాతోనే ఉంటారు సార్. వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేసే వాళ్లతో ఇలాగే ఉండాలి.. ఇలాగే ఉంటాను కూడా’’ అని చెప్పారు. దీంతో సారీ అన్న మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకున్నామంటూ మరి కొందరు ఫ్యాన్స్ ట్విట్టర్‌లో కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి : Director Harish Shankar కు మరో ట్విట్టర్ ఎకౌంట్.. అక్కడ అంతా బూతుపురాణమే..