Director Harish Shankar కు మరో ట్విట్టర్ ఎకౌంట్.. అక్కడ అంతా బూతుపురాణమే..

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-09-26 07:55:34  IST  )

డైరెక్టర్ హరీశ్ శంకర్ మనుసులో అనుకున్నది అనుకున్నట్లుగా.. మొహమాటం లేకుండా చెప్పేస్తాడు.

Director Harish Shankar కు మరో ట్విట్టర్ ఎకౌంట్.. అక్కడ అంతా బూతుపురాణమే..
X

దిశ, సినిమా : డైరెక్టర్ హరీశ్ శంకర్ మనుసులో అనుకున్నది అనుకున్నట్లుగా.. మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. ఎంత పెద్దవాళ్లైనా సరే తప్పు చేస్తే కచ్చితంగా తప్పు అనే చెప్తాడు. అయితే తాజాగా ఆయనకు ఓ బ్యాకప్ ట్విట్టర్ ఎకౌంట్ ఉందని.. అందులో మొత్తం బూతుల పురాణం ఉందని చెప్తూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఇన్నాళ్లకు బయటపడ్డాడని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఈ క్రమంలో స్పందించిన డైరెక్టర్.. ‘నేను ఎవరికీ భయపడను. అనాలనుకున్నప్పుడు నా ఎకౌంట్‌లోనే పోస్ట్ చేస్తా. ఇంకో ఎకౌంట్ అక్కర్లేదు. పైగా అసభ్య పదజాలాన్ని ప్రోత్సహించను. ఇలాంటి నాన్‌సెన్స్ ఆపడం మంచిది’ అని సూచించాడు. దీనిపై రెస్పాండ్ అవుతున్న నెటిజన్స్.. ఒకరిని అనుమానించే ముందు కనీసం వెరిఫై చేసుకోకపోతే ఎలా అని తిట్టిపోస్తున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ యూజ్ చేసేవాళ్లకు అటెన్షన్ ఇవ్వకూడదని హరీశ్ శంకర్‌కు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై డైరెక్టర్ ఫైర్.. వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారంటూ అసహనం

Next Story