నువ్వు అమ్మాయి కాదని తెలిశాకే మరో పెళ్లి చేసుకున్నా.. జబర్దస్త్ నటిపై షాకింగ్ కామెంట్స్

by Anjali |
నువ్వు అమ్మాయి కాదని తెలిశాకే మరో పెళ్లి చేసుకున్నా.. జబర్దస్త్ నటిపై షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరించే వర్ష-ఇమ్మాన్యుయల్ జోడీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ వేదికగా ఒక్కటైన ఈ జంట ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తారు. అయితే వర్షది లేడీ గెటప్ అంటూ అప్పుడప్పుడు ఇమ్మాన్యూయల్ కామెడీ చేయడం మనం చూస్తుంటాం. తాజాగా.. ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఇమ్మాన్యూయల్ లేడీ గెటప్ వేశాడు. అతడి భార్యగా వర్ష నటించింది. నేను ఉండగా మరో అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావని వర్ష స్కిట్‌లో భాగంగా ఇమ్మూను అడుగుతుంది. దీంతో అతను.. ‘నిన్ను పెళ్లి చేసుకున్నాకే తెలిసిందమ్మా నీవు అమ్మాయివి కాదని, అందుకే ఇంకో అమ్మాయిని వివాహం చేసుకున్నా’. అంటూ సెటైర్ వేశాడు. ఇక వర్ష.. ముఖం సీరియస్‌గా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిది.

ఇవి కూడా చదవండి:

ప్రియుడితో తలనొప్పులు భరించలేక.. పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్..

Next Story

Most Viewed