- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ధురంధర్-2’ అంతా బక్వాస్.. రణ్‌వీర్ సింగ్ సినిమాపై నిప్పులు చెరిగిన ఎంపీ!
అసలు అది ఒక సినిమానా? మూడు గంటల పాటు అంతా సోది చూపించారు. నాకు అలాంటి చిత్రాలు చూడటానికి మూడు గంటల టైమ్ లేదు.

దిశ, సినిమా: ఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా బాలీవుడ్ సినిమా ‘ధురంధర్-2’పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు వసూలు చేస్తున్నా, ఒవైసీకి మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చలేదని అర్థమవుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ మూవీ కేవలం బక్వాస్ అని కొట్టిపారేశారు. ధురంధర్-2 గురించి ఒవైసీని ప్రశ్నించగా.. "అసలు అది ఒక సినిమానా? మూడు గంటల పాటు అంతా సోది చూపించారు. నాకు అలాంటి చిత్రాలు చూడటానికి మూడు గంటల టైమ్ లేదు. అందులో బూతులు, హింస తప్ప ఏముంది? ఆ సినిమా చూసిన తర్వాత ముస్లింలను తిట్టాలా వద్దా అని జనం ఆలోచించేలా చేస్తున్నారు. ఇలాంటివి చూడటానికి ఎవరికి తీరిక ఉంటుంది?" అని ఆయన ఘాటుగా విమర్శించారు.
ప్రపంచమంతా ఈమూవీ చూసి మెచ్చుకుంటోంది కదా అని యాంకర్ అడగగా, ఒవైసీ తనదైన హైదరాబాదీ స్టైల్‌లో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. "మా హైదరాబాద్‌లో ఒక సామెత ఉంది.. ప్యారే, ఇలాంటి విషయాలను మనసుకి తీసుకోకు, శవం మీద వేసేయ్ అని అంటారు. మేము కూడా అలాగే దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తాము" అని తనదైన శైలిలో చురకలు వేశారు. ఒవైసీ ఎన్ని విమర్శలు చేసినా, ‘ధురంధర్ 2’ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఒక ఇండియన్ స్పై పాకిస్థాన్‌లోని టెర్రరిస్టులను ఎలా అంతం చేశాడనే కథతో వచ్చిన ఈచిత్రం, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూలు చేసింది.






