Dhandoraa Review: కుల వివక్షపై ఎక్కుపెట్టిన బాణం.. శివాజీ నటన అదరహో!

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-25 10:40:32  IST  )

ఈ ఏడాది చివరి వారంలో క్రిస్మస్ కానుకగా చాలా సినిమాలే విడుదలయ్యాయి. ఇక ఇందులో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల్లో .. దండోరా(Dhandoraa) ఒకటి.

Dhandoraa Review: కుల వివక్షపై ఎక్కుపెట్టిన బాణం.. శివాజీ నటన అదరహో!
X

దిశ, సినిమా: ఈ ఏడాది చివరి వారంలో క్రిస్మస్ కానుకగా చాలా సినిమాలే విడుదలయ్యాయి. ఇక ఇందులో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల్లో .. దండోరా(Dhandoraa) ఒకటి. మురళీకాంత్ దర్శకత్వంలో శివాజీ, నందు, నవదీప్, రవికృష్ణ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన 'దండోరా' చిత్రం ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదలై ప్రేక్షకుల మనసు గెలుచుకుంటోంది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు మార్క్ కె. రాబిన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ కుల వివక్ష, పరువు హత్యలు, అధికార దుర్వినియోగం వంటి సమాజంలోని సున్నితమైన సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా, గట్టి కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రం అన్యాయానికి గురైన ఓ వర్గం తమ హక్కుల కోసం చేసే పోరాటాన్ని ఎంతో ఉత్కంఠగా ఆవిష్కరించింది.

2004 నుంచి 2019 వరకు సాగే ఈ కథలో సమాజంలో వచ్చిన మార్పులను దర్శకుడు చక్కగా ప్రతిబింబించారు. నటీనటుల విషయానికి వస్తే, శివాజీ తన పాత్రలో ఒదిగిపోయి పవర్‌ఫుల్ నటనను కనబరచగా, నందు, నవదీప్, రవికృష్ణ తమ వంతు న్యాయం చేశారు. మరీ ముఖ్యంగా శివాజీ నటన అదరహో అనేలా ఉంది. ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తోంది. తెలంగాణలోని తుళ్లూరు అనే ఊరి నేపథ్యంలో, కుల వివక్ష మరియు అసమానతలను ఈ చిత్రం ఎంతో లోతుగా చర్చించింది. అగ్ర కులానికి చెందిన శివాజీ (శివాజీ) కూడా అదే కుల వివక్షకు ఎలా గురయ్యాడు, ఆయన మరణించాక అంతిమ సంస్కారాల విషయంలో ఎదురైన ఆటంకాలు ఏంటి అనే ఆసక్తికర అంశాలతో ఈ కథ సాగుతుంది. ముఖ్యంగా పరువు హత్యల వల్ల కేవలం బాధితులే కాకుండా, ఆ ఘటనలకు పాల్పడిన కుటుంబాలు కూడా ఎలా ఛిన్నాభిన్నం అవుతాయో చూపించిన విధానం ఆలోచింపజేస్తుంది. భావోద్వేగ సన్నివేశాల్లో బిందు మాధవి నటన ఆకట్టుకుంటుంది.అక్కడక్కడా కథ కాస్త నెమ్మదించినట్లు అనిపించినా, బలమైన ఎమోషన్స్ వల్ల సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. మొత్తానికి ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రానికి రేటింగ్ పరంగా 3/5 లభించింది.

Dhandoraa OTT: ఆ ఓటీటీ చేతికి దండోరా...స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

శివాజీ కాంట్రవర్సీ కామెంట్స్ పై.. హెబ్బా పటేల్ రియాక్షన్ ఇదే..

Next Story