- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శివాజీ కాంట్రవర్సీ కామెంట్స్ పై.. హెబ్బా పటేల్ రియాక్షన్ ఇదే..!
టాలీవుడ్ యాక్టర్ శివాజీ(Shivaji) ‘దండోర’(Dandora) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ పై చేసిన కామెంట్స్ గత రెండు రోజులుగా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యాక్టర్ శివాజీ(Shivaji) ‘దండోర’(Dandora) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ పై చేసిన కామెంట్స్ గత రెండు రోజులుగా ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన కామెంట్స్ పై ఇప్పటికే కొంత మంది స్పందించి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో తాజాగా హెబ్బా పటేల్(Hebah Patel) ఈ కామెంట్స్ పై షాకింగ్ రిప్లై ఇచ్చింది. ప్రజెంట్ హీరోయిన్స్ డ్రెస్సింగ్ గురించి ట్రెండింగ్ టాపిక్ నడుస్తోంది.
దీనిపై మీ రియాక్షన్ ఏంటి అని యాంకర్ అడుగగా.. దీనికి హెబ్బా స్పందిస్తూ ‘నాకు ఎవరి కామెంట్స్ పై స్పందించాలని, వాళ్ల విషయాల్లో తల దూర్చడం కానీ నాకు ఇష్టం లేదు.. మనం వీటికి ఎంత దూరం అంటే అంత మంచిది.. అయితే ఓ మహిళ ఆమెకు నచ్చిన డ్రెస్సు వేసుకునే స్వాతంత్య్రం ఉంది. అయితే దీనిపై నాకు స్పందించాలని లేదు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
కాగా హెబ్బా పటేల్ ‘కుమారి 21ఎఫ్’(Kumari 21F) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రజెంట్ ఈ భామ నటించిన ‘ఈషా’(Eesha) మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. శ్రీనివాస్ మన్నె(Srinivas Manne) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్ రాజ్(Akhil Raj)తో పాటు త్రిగుణ్(Trigun) హీరోలుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్ టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.
Read More..
‘నన్ను తక్కువగా అంచనా వేయొద్దు’.. అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్ (పోస్ట్)
నా పెద్ద కొడుకుకి నేను వేసుకునే బట్టలు నచ్చవు.. ఛీ అమ్మా బాలేవు అని అంటాడు.. అనసూయ పాత వీడియో వైరల్






