- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా పెద్ద కొడుకుకి నేను వేసుకునే బట్టలు నచ్చవు.. ఛీ అమ్మా బాలేవు అని అంటాడు.. అనసూయ పాత వీడియో వైరల్
టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ జబర్దస్త్(Jabardasth) కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. దీంతో ఈ చిన్నదానికి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘రంగస్థలం’(Rangasthalam) మూవీలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది. దీంతో అక్కడి నుంచి ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా ‘పుష్ప’(Pushpa), ‘పుష్ప-2’(Pushpa-2) వంటి భారీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఇదిలా ఉంటే.. ‘దండోరా’ ఈవెంట్‌లో శివాజీ అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది. అలా కాకుండా అభ్యంతరకరంగా (సామాన్లు కనిపించేలా) బట్టలు వేసుకుంటే అందులో విలువేముంటుంది? అంటూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌పై ఇప్పటికే అనసూయ స్పందించి కౌంటరిస్తూ ఉంది. ఈ క్రమంలో అనసూయకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో యాంకర్.. ‘మీరు ఇంత చిన్న బట్టలు వేసుకుంటే మీ పిల్లలు ఏమనరా’ అని అడిగింది. ఇక దానికి అనసూయ స్పందిస్తూ.. ‘నా పెద్ద కొడుకుకు నేను పొట్టి బట్టలు వేసుకుంటే అతనికి నచ్చదు. ఇంత చిన్నగా ఎందుకు వేసుకున్నావు మమ్మా.. ఛీ అస్సలు బాగోలేదు అని అంటాడు. అయితే నేను అతనితో అంటాను అరే అది నా ఛాయిస్‌రా అని.. నాకు కూడా నువ్వు వేసుకునే అవెంజర్స్ టీ షర్ట్ నచ్చదు.
కానీ నీకు ఇష్టం కాబట్టి వేసుకోనిస్తున్నాను అని అంటాను. నేను ఇప్పటి వరకు వాళ్లకి చెప్పేది ఒక్కటే ఇప్పుడు స్నానానికి వెళ్ళినా మీకు నచ్చిన దుస్తులు తీసుకొని వెళ్లండి అని చెప్తాను. అయితే నాకు మా అమ్మ డిగ్రీ వరకు నేను ఏ బట్టలు వేసుకోవాలో బయట పెట్టేవారు. అంత రిస్ట్రిక్ట్‌గా బ్రతికాను నేను.. అందుకే కావచ్చు.. నాలో ఇంకా ఇంటెగ్రిటీ ఉంది. అయితే నేను వాళ్లని తప్పు పట్టట్లేదు. కానీ ఎలాంటి డ్రెస్ వేసుకోవడం అనేది నా ఇష్టం’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పాత వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్స్ పిల్లల దగ్గరనే విలువ లేదు నీకు ఇంకా బయట ఎవరు ఇస్తారని, Avenger టీషర్టులు బికినీలు ఒకటే నా అక్క....ఆ పిల్లాడికి ఉన్న కామన్ సెన్స్ నీకు ఉండకపోతే ఎలా అని, పిల్లలతో చెప్పించుకునే స్థాయికి వచ్చావా ఛీ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
Read More..
‘నన్ను తక్కువగా అంచనా వేయొద్దు’.. అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్ (పోస్ట్)
Samantha: వైరల్ వీడియోపై స్పందించిన సామ్.. వారి తప్పు లేదంటూ సంచలన కామెంట్స్
నన్ను తక్కువగా అంచనా వేయొద్దు’.. అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్ (పోస్ట్)






