Dhandoraa OTT: ఆ ఓటీటీ చేతికి దండోరా...స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

by velandi.Saikiran |   (  Updated:2025-12-25 10:39:22  IST  )

OTT డేట్ ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జనవరి చివరలో ఈ మూవీని

Dhandoraa OTT: ఆ ఓటీటీ చేతికి దండోరా...స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ నటుడు శివాజీ, బిందు మాధవి, నవదీప్, రవికృష్ణ కలిసి నటించిన సినిమా దండోరా. బెదురులంక 2012 లాంటి సినిమా అందించిన లౌక్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత రవీంద్ర బెనర్జీ ఈ సినిమాను తీశారు. ఈ సినిమాకు మురళీ కాంత్ దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యం, కుల వ్యవస్థ చుట్టూ ఈ సినిమా క‌థ‌ సాగుతుందట. అయితే ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అయింది. జనాలకు కథ నచ్చడంతో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా OTT డేట్ ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జనవరి చివరలో ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయబోతున్నారట. లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది.

Dhandoraa Review: కుల వివక్షపై ఎక్కుపెట్టిన బాణం.. శివాజీ నటన అదరహో

Next Story