రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్-2’పై రియాక్ట్ కాలేదంటూ ట్రోల్స్.. నెటిజన్లకు దిమ్మతిరికే కౌంటర్ ఇచ్చిన దీపిక

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-08 05:48:13  IST  )

నీ భర్త సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది, రికార్డులు తిరగరాస్తోంది. కానీ నువ్వు మాత్రం ఆ సినిమాను ఎందుకు చూడలేదు?

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్-2’పై రియాక్ట్ కాలేదంటూ ట్రోల్స్.. నెటిజన్లకు దిమ్మతిరికే కౌంటర్ ఇచ్చిన దీపిక
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్-2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ స్పై థ్రిల్లర్ సెన్సేషనల్ హిట్‌గా నిలవడమే కాకుండా, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. అయితే, ఈ సినిమా సక్సెస్ ఒకవైపు ఉంటే.. రణ్‌వీర్ భార్య, దీపికా పదుకొణె మాత్రం ఈ మూవీపై ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడం గమనార్హం. దీంతో నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ గత కొన్ని రోజులుగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా, ఈ విషయంపై ఓ నెటిజన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా దీపికాను ఉద్దేశించి.. "నీ భర్త సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది, రికార్డులు తిరగరాస్తోంది. కానీ నువ్వు మాత్రం ఆ సినిమాను ఎందుకు చూడలేదు? కనీసం దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు?" అని నేరుగా ప్రశ్నించాడు.

దీనికి దీపికా తనదైన శైలిలో స్పందిస్తూ నెటిజన్లకు దిమ్మతిరికే కౌంటర్ ఇచ్చింది. "మీ అందరికంటే ముందే నేను ఆ సినిమాను చూశాను. కానీ ఆ విషయం మీకు తెలీదు. ఇప్పుడు చెప్పండి.. అసలు విషయం తెలియకుండా ఎవరు ఎవరిని విమర్శించాలి?" అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. దీపికా ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌంటర్‌తో ట్రోలర్స్ నోళ్లు మూతపడ్డాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా ఈ జంట ఒకరి సినిమాలను మరొకరు సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి దీపికా సైలెంట్‌గా ఉండటంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ, దీపికా తాజా కామెంట్స్‌తో తమ మధ్య అంతా సవ్యంగానే ఉందని, సినిమాను ఇప్పటికే చూసి ఎంజాయ్ చేశానని క్లారిటీ ఇచ్చేసింది.

ఇండియన్ సినిమాలో ముందెన్నడూ చూడని అనుభూతి .. ‘ధురంధర్-2’ మూవీకి కోహ్లీ ఫిదా

Next Story