- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల పవర్‌ను చూపించబోతున్న దీపికా పదుకొణె.. క్రేజీ కాంబోలో లేడీ ఓరియెంటెడ్ మూవీ!
పురుషాధిక్యత, పాత ఆలోచనలు ఉన్న ఒక సమాజంలో పుట్టిన ఒక మహిళ.. తనపై ఉన్న ఆంక్షలను, అణచివేతను ఎదిరించి ఎలా ఒక పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించింది అనేదే ఈ మూవీ మెయిన్ పాయింట్ అని టాక్.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కింగ్’ సినిమాతో ప్రేక్షకుల మందుకు రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకురాలు జోయా అఖ్తర్ కాంబినేషన్‌లో ఒక బలమైన సామాజిక కథాంశంతో రాబోతున్న సినిమాలో దీపికా లీడ్ రోల్‌లో నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కథ విషయానికొస్తే.. పురుషాధిక్యత, పాత ఆలోచనలు ఉన్న ఒక సమాజంలో పుట్టిన ఒక మహిళ.. తనపై ఉన్న ఆంక్షలను, అణచివేతను ఎదిరించి ఎలా ఒక పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించింది అనేదే ఈ మూవీ మెయిన్ పాయింట్ అని టాక్. ఆడవాళ్ల ఆశలను అణచివేసే సమాజంలో, ఎంతో ధైర్యంతో ఆమె సాధించిన విజయం, ఆ తర్వాత ఎంతోమంది మహిళలకు ఆమె ఎలా ఆదర్శంగా నిలిచింది అనే విషయాలను ఈ సినిమాలో ఎంతో స్ఫూర్తిదాయకంగా చూపించబోతున్నారట.
జోయా అఖ్తర్ చెప్పిన ఈ కథ దీపికా మనస్సుకు బాగా నచ్చిందని, అందులోని ఎమోషన్స్‌కు ఆమె వెంటనే కనెక్ట్ అయిపోయిందని నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఇందులో భారతీయ సినీ దిగ్గజం, సీనియర్ నటి రేఖ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. ఈ పాత్ర కథానాయిక ప్రయాణంలో చాలా ముఖ్యమైనదిగా ఉంటుందని సమాచారం. దీపికా పదుకొణె, రేఖ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి వెండితెరపై ఒక మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయట. ఇది కేవలం గ్లామర్ కోసమో లేదా కమర్షియల్ హంగుల కోసమో తీసే ప్రాజెక్ట్ కాదని, సమాజంలో మహిళలు ఎదుర్కొనే లింగ వివక్ష, కుటుంబాల నుండి వచ్చే ఒత్తిడి వంటి వాస్తవ పరిస్థితులను ఎంతో సహజంగా చూపించే సినిమాగా రాబోతుందని తెలుస్తోంది.






