- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీర కట్టులో కూల్ స్టిల్స్‌తో ఆకట్టుకుంటున్న ఫాతిమా సనా
చీర కట్టులో సూపర్ లుక్‌తో మెరిసిపోతున్న ఫాతిమా సనా షేక్.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె 1997లో విడుదలైన ఇష్క్ చిత్రంతో బాలనటిగా వెండితెరకు పరిచయమైంది.
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ, ఈమెకు అసలైన గుర్తింపు మాత్రం ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దంగల్ సినిమాతో వచ్చింది. ఈ చిత్రంలో ఫాతిమా సనా షేక్‌కు అద్భుతమైన పాత్ర దక్కడం, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల ఈమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.
ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం బాలీవుడ్‌లో తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఇక సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె, సోషల్ మీడియాలో కూడా అదే తరహాలో సందడి చేస్తోంది.
తాజాగా ఫాతిమా సనా షేక్ ఎరుపు రంగు అంచు కలిగిన బ్లూ కలర్ చీరను ధరించి, అందుకు తగిన స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో క్యూట్ లుక్స్‌తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
అలాగే పెద్ద ఇయర్ రింగ్స్ ధరించి మరింత అందంగా కనిపించింది. మొత్తంగా ఈ ఫోటోలలో ఆమె సూపర్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుండటంతో, ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






