పవన్ కళ్యాణ్‌ పక్కన డాన్స్ చేయడం నా కెరీర్‌లోనే మర్చిపోలేని అనుభూతి: రాశీ ఖన్నా

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-13 13:41:14  IST  )

పవన్ గారు సెట్స్‌లో ఉంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వర్ణించలేము. ఆయన పక్కన డాన్స్ చేయడం నా కెరీర్‌లోనే మర్చిపోలేని అనుభూతి.

పవన్ కళ్యాణ్‌ పక్కన డాన్స్ చేయడం నా కెరీర్‌లోనే మర్చిపోలేని అనుభూతి: రాశీ ఖన్నా
X

దిశ, సినిమా: మెగా పవర్ ప్యాక్డ్ కాంబో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ మళ్ళీ మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరి కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మార్చి 19న ఉగాది పండుగను ముందే తీసుకురాబోతోంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీలతో పాటు మరో అందాల భామ రాశీ ఖన్నా కూడా భాగమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి రాశీ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించాలనేది తన కెరీర్ బిగినింగ్ నుంచి ఉన్న పెద్ద కల అని, అది ‘ఉస్తాద్’తో తీరిందని రాశీ ఎమోషనల్ అయ్యింది. ‘‘పవన్ గారు సెట్స్‌లో ఉంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వర్ణించలేము. ఆయన పక్కన డాన్స్ చేయడం నా కెరీర్‌లోనే మర్చిపోలేని అనుభూతి. హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారిలోని అసలైన మాస్ యాంగిల్‌ను, ఆ పాత రోజుల్లోని జోష్‌ను పక్కాగా ప్రజెంట్ చేశారు" అని రాశీ చెప్పుకొచ్చింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ (DSP) సంగీతం అందిస్తుండటంతో సాంగ్స్ రేంజ్ మరో లెవల్‌లో ఉండబోతున్నాయని రాశీ ధీమా వ్యక్తం చేసింది. పవన్ మార్క్ మాస్ ఎలిమెంట్స్, హరీష్ శంకర్ పవర్ ఫుల్ డైలాగ్స్, రాశీ ఖన్నా గ్లామర్.. అన్ని కలిసి ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ కోసం త్రివిక్రమ్ అలాంటి సహాయం చేశారు

Next Story