- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Shankar: ఉస్తాద్ భగత్ సింగ్ కోసం త్రివిక్రమ్ అలాంటి సహాయం చేశారు
హరీష్ శంకర్ మాట్లాడుతూ... మా సినిమా టైంలో పవన్ గారు హరిహర వీరమల్లు, ఓజీ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. వాటి మధ్య మా సినిమాకు త్రివిక్రమ్ గారు తేదీలను సర్దుబాటు చేశారు అని చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: హరీష్ శంకర్ 'షాక్' చిత్రంతో దర్శకుడిగా కెరీర్ను ప్రారంభించాడు. ఈ మూవీ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మిరపకాయ్, గబ్బర్ సింగ్ చిత్రాలతో మంచి విజయాలను అందుకొని తెలుగులో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా ఈ దర్శకుడు 'పవన్ కళ్యాణ్'తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీని మార్చి 19న విడుదల చేయనున్నారు. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడడంతో హరీష్ శంకర్ పెద్ద ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నాడు.
అందులో భాగంగా అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తున్నాడు. తాజాగా హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ గారితో ఎవరైనా సినిమా చేస్తున్నారు అంటే ఆ సినిమా విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంతో కొంత ఉంటుంది అని ఒక టాక్ ఉంది, మరి ఈ సినిమా విషయంలో కూడా ఆయన ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా అనే ప్రశ్న ఎదురయింది. దీనికి హరీష్ శంకర్... త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మా సినిమా విషయంలో ఏమాత్రం ఇన్వాల్వ్ కాలేదు, కానీ మా సినిమా అద్భుతంగా ముందుకు సాగడానికి ఎంతో సహాయం చేశారు.
ఒకరోజు నేను పవన్ కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ చెప్పడానికి వెళ్ళాను, ఆ సమయంలో పవన్, త్రివిక్రమ్ ఇద్దరూ ఒకే చోట ఉన్నారు. నేను వెళ్లి స్క్రిప్ట్ చెపుతాను అనగానే త్రివిక్రమ్ గారు బయటికి వెళ్లిపోతా అన్నారు. నేను ఉండండి సార్ అని అన్నాను, కానీ ఆయన మాత్రం మీ మధ్యలో నేను వద్దు అని వెళ్ళిపోయారు. కానీ మా సినిమా సమయంలో పవన్ గారు హరిహర వీరమల్లు, ఓజీ షూటింగ్లతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాల మధ్యలో మాకు డేట్స్ అడ్జస్ట్ చేసే విషయంలో ఆయన ఎంతో సహాయం చేశారు అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు.






