Ustad Bhagat Singh: ఎక్కడ చూసినా ఆయనే.. దేన్నీ వదలట్లేదుగా

by Pulgam srinivas |   (  Updated:2026-03-13 09:19:45  IST  )

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్లను అద్భుతంగా నిర్వహిస్తున్న హరీష్ శంకర్.

Ustad Bhagat Singh: ఎక్కడ చూసినా ఆయనే.. దేన్నీ వదలట్లేదుగా
X

దిశ, వెబ్ డెస్క్: సినిమాలు అద్భుతంగా తీశాము అనే దానికంటే కూడా దానిని సూపర్ గా ప్రమోట్ చేశాము అనేదే ప్రస్తుతం ముఖ్యం. చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లయితే ఓ సినిమాకు విడుదల అయిన తర్వాత నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఆ తర్వాత పుంజుకొని భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. ఏ సినిమాకైనా విడుదల అయినా రెండు వారాల్లోనే కలెక్షన్లు రావాలి.

అప్పటివరకు సినిమా పెద్ద స్థాయిలో కలెక్షన్లను రాబట్టకపోతే ఆ మూవీ లాభాలను అందుకోవడం కష్టమే. దాంతో సినిమాకు హిట్టు టాక్ వస్తేనే ఆ మూవీ మంచి కలెక్షన్లను రాబట్ట గలుగుతుంది. మొదటి రోజే వీలైనంతవరకు ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చేందుకు మేకర్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తూ వస్తున్నారు. సినిమాకు గనక హిట్ టాక్ వస్తే ఫస్ట్ వీక్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కావాలి, ఆ తర్వాత రెండవ వారం పెద్ద మొత్తంలో లాభాలను అందుకోవాలి. అలా జరగాలి అంటే ఓ సినిమా వస్తుందని జనాలకు తెలియాలి.

అలా తెలియాలి అంటే దానికి ప్రమోషన్స్ కీలకపాత్రను పోషిస్తాయి. అందుకే సినిమా పూర్తి కాగానే దానికి సంబంధించిన ప్రమోషన్లను పెద్ద ఎత్తున చేస్తున్నారు. మార్చి 19వ తేదీన పవన్ కళ్యాణ్ హీరోగా రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్ర విడుదల తేది దగ్గర పడడంతో హరీష్ శంకర్ పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఈయనే కనిపిస్తున్నాడు. అసలు ఖాళీ లేకుండా ఈయన ప్రమోషన్లను చేస్తూ ఉండడంతో చాలామంది హరీష్ శంకర్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడుతున్నాడని అభిప్రాయపడుతున్నారు.

'కాలరే ఎత్తరా'.. అంటున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Next Story