- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'కాలరే ఎత్తరా'.. అంటున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’
‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

దిశ, సినిమా: ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఇందులో నుంచి విడుదలైన ప్రతి పాట, టీజర్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ తాజాగా చిత్రబృందం మూడో గీతం ‘కాలరే ఎత్తరా’ను విడుదల చేసింది. ఈ పాట విడుదలతో సినిమాపై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. భారీ స్థాయిలో రూపొందించిన ఈ పాటలో భారీ సెట్‌లు, కట్టిపడేసే విజువల్స్, అద్భుతమైన ఎనర్జీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ తన ప్రత్యేకమైన స్టైల్, ఎనర్జీ, డ్యాన్స్ స్టెప్పులతో తెరపై వెలుగులు నింపారు. కాగా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. మార్చి 14వ తేదీన ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనుంది చిత్రబృందం. అనంతరం మార్చి 15వ తేదీన భారీ ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ మార్చి 19వ తేదీన థియేటర్లలో అడుగుపెట్టనుంది.






