Yashoda Movie: కోర్టులో సమంతకు ఊహించని షాక్..

by Disha Web Desk 19 |
Yashoda Movie: కోర్టులో సమంతకు ఊహించని షాక్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ''యశోద''. సరోగసి బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ మూవీ.. నవంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుండి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోన్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపింది. ఇక, థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోన్న యశోద మూవీ ఓటీటీ విడుదలకు బ్రేక్ పడింది. డిసెంబర్ 19 వరకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో యశోద చిత్రాన్ని విడుదల చేయవద్దని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.

యశోద సినిమాలో తమ హాస్పటల్ ప్రతిష్టను దెబ్బ తీసేలా చూపించారని ఇవా హాస్పటల్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. యశోద చిత్రంలో ఇవా ఐవీఎఫ్ హాస్పటల్ క్యారెక్టర్‌ను దెబ్బ తీసే విధంగా చిత్రికరించారని.. సమంత క్యారెక్టర్‌లో ఇవా హాస్పటల్ రేపిటేషన్ దెబ్బతినెలా చూపించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. యశోద సినిమా యూనిట్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. ఓటీటీలో డిసెంబర్ 19 వరకు యశోద చిత్రాన్ని విడుదల చేయడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది.

Read more:

1.ఆ నిర్మాత వల్లే నా బతుకు ఇలా అయింది.. Janhvi Kapoor



Next Story

Most Viewed