ఆ నిర్మాత వల్లే నా బతుకు ఇలా అయింది.. Janhvi Kapoor

by Chukka Sudharani |   (  Updated:2022-11-23 12:57:41  IST  )

స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తనను లాంచ్ చేయడంపై జాన్వీ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆ నిర్మాత వల్లే నా బతుకు ఇలా అయింది.. Janhvi Kapoor
X

దిశ, సినిమా : స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తనను లాంచ్ చేయడంపై జాన్వీ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ప్రముఖ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధర్మ ప్రొడక్షన్స్‌తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడిన నటి.. 'నాపై ట్రోలింగ్‌కు ఐకానిక్ 'ధర్మ ప్రొడక్షన్స్' కారణమని భావిస్తున్నా. జనాలు నన్ను ద్వేషించడానికి సులభమైన మార్గాన్ని కల్పించింది. ఈ విధంగా నన్ను ఒత్తిడికి గురిచేస్తోంది. కానీ, దీని గురించి ఎప్పటికీ ఒక్క క్షణం కూడా పశ్చాత్తాపపడను. ఎందుకంటే కరణ్, అతనికి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ సృజనాత్మక నిర్ణయాల గురించి మీకు తెలియదు. అది మనిషి క్రియేటివ్ వ్యూను పెంపొందించేందుకు కట్టుబడి ఉంటుంది. నా విషయంలో గౌరవంగా ఉంది. అన్నిటికి మించి కరణ్ వంటి మేకర్ నుంచి విశ్వాసం, ప్రేమ, మార్గదర్శకత్వం లభించింది' అంటూ తన ఒపీనియన్ చెప్పేసింది.

ఇవి కూడా చదవండి : బెడ్ రూమ్‌లో భర్తతో Pranitha Subhash.. లీకైన ఫొటోలు

Next Story