సూపర్ స్టార్ మహేశ్ బాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు

by Disha Web Desk 9 |
సూపర్ స్టార్ మహేశ్ బాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నేళ్ల పరిశ్రమలో తనపై ఇప్పటి వరకు ఏ ఒక్క రూమర్ కూడా రాలేదు. అలాంటిది తనను తాను ఫిల్మ్ క్రిటిక్ అని చెప్పుకునే ఉమైర్ సంధు ఇటీవల ఏకంగా స్టార్ హీరోలపైనే రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నాడు. గతంలో బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్ల మధ్య ఉన్న ఎఫైర్ల గురించి నోటికచ్చినట్లు మాట్లాడాడు. ‘చిరంజీవి అంకుల్ ఇంకా యూత్‌లా కనిపించాలనే ప్రయత్నాలు మానుకోండి. మీ వయస్సు ఇప్పుడు 70 ఏళ్లు అని గుర్తుంచుకోండి’’ అంటూ ట్వీట్ చేశాడు.

తర్వాత ‘పవన్ కళ్యాణ్‌కు ఇప్పటికే మీకు రెండుసార్లు డివోర్స్ అయ్యాయి. ఇంతమంది హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ.. చాలా దూరం వెళ్లాడు అనే అర్థంలో కామెంట్ చేశాడు. ఇటీవల అనన్య పాండే శృంగారానికే బానిసైంది అంటూ మరో ట్వీట్ చేశాడు. ఇప్పుడ తాజాగా సూపర్ స్టార్‌ను టార్గెట్ చేసి.. ‘మహేష్ బాబు లెక్క ప్రకారం విదేశీయులతో శృంగారం యంగ్‌గా, సెక్సీగా ఉండేలా చేస్తుందంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఉమైర్ చేసిన వ్యాఖ్యలపై మహేష్ అభిమానులు మండిపడుతున్నారు.Read more:

టాలీవుడ్ స్టార్ హీరోస్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా?


Next Story

Most Viewed