రీల్స్ కోసం బైక్ తో రోడ్డెక్కుతే కఠిన చర్యలే : సీఐ ఇజాజోద్దీన్

by Nallavelli.Anjaneyulu |

సోషల్ మీడియా లో రీల్స్ కోసం బైక్ తో రోడ్డెక్కి స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ టూ టౌన్ సీఐ ఇజాజోద్దీన్ హెచ్చరించారు.

రీల్స్ కోసం బైక్ తో రోడ్డెక్కుతే కఠిన చర్యలే : సీఐ ఇజాజోద్దీన్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : సోషల్ మీడియా లో రీల్స్ కోసం బైక్ తో రోడ్డెక్కి స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ టూ టౌన్ సీఐ ఇజాజోద్దీన్ హెచ్చరించారు. కొందరు యువకులు పట్టణంలోని రోడ్లపై బైకులతో ప్రమాదకర స్టంట్లు చేస్తున్న దృశ్యాల వీడియోలను సోషల్ మీడియా వేదికలైన ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ లలో పోస్ట్ చేశారని ఆయన తెలిపారు. ఎస్పీ జానకి ఆదేశాల మేరకు సీసీ టీవీ ఫుటేజీలు, సోషల్ మీడియా ఆధారాల ద్వారా ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతున్న యువకులు టూ టౌన్ పరిధిలోని యువకులని గుర్తించి అదుపులోకి తీసుకుని, వారి తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు సీఐ తెలిపారు. మైనర్లు వాహనాలను నడపడం చట్టరీత్యా నేరమని, ఇందుకు వారి తల్లిదండ్రులు కూడా బాధ్యులని, చట్టపరంగా వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు, రీల్స్ లేదా వీడియో రూపంలో సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఇజాజోద్దీన్ హెచ్చరించారు.

Next Story