వచ్చేసిన చిరంజీవి ‘Bhola Shankar’ Review.. బాస్ సినిమా హిట్టా..? ఫట్టా..?

by Disha Web Desk 9 |
వచ్చేసిన  చిరంజీవి ‘Bhola Shankar’ Review.. బాస్ సినిమా హిట్టా..? ఫట్టా..?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా స్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ కలిసి నటించిన సినిమా ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళ్‌లో హిట్ కొట్టిన ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. ‘భోళా శంకర్’ సినిమా నుంచి రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఇక భారీ అంచనాల నడుమ నేడు ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే పలు చోట్ల బెనిఫిట్ షోలు పడిపోయాయి. సినిమా ఎలా ఉంది అనే దానిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు నెటిజన్లు. మరి బాస్ హిట్ కొట్టాడా లేదా చూసేద్దాం.

కథ విషయానికి వస్తే.. కోల్ కత్తాలో నివసించే తెలుగు ఫ్యామిలీ కథ ఇది. చిరంజీవి, కీర్తి సురేష్‌ అన్నాచెల్లెళ్లు. కోల్ కత్తాలో అమ్మాయిలు కిడ్నాప్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా సాగుతుంది. ఇక కిడ్నాప్‌లకు, అన్నా చెల్లెల కథకి లింక్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇప్పటికే ఓవర్సీస్ ఆడియన్స్ సినిమా చూశారు. సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. ఫస్టాఫ్ కొంచెం సైలెంట్‌గా ఉందట. చిరంజీవి, తమన్నా కామెడీ కొన్నిసార్లు మంచిగా ఉన్న అంతగా పండలేదు అంటున్నారు. ఇక సెకండాఫ్ చిరంజీవి, కీర్తి సురేష్‌ సిస్టర్ సెంటిమెంట్ బాగుందని అంటున్నారు. సినిమాలో ఏదైనా ప్లస్ ఉందంటే అది చిరంజీవి లుక్ మాత్రమేనని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఇక చిరంజీవి అభిమానులు అయితే.. బ్లాక్ బస్టర్ హిట్ అని అంటున్నారు. ఓవరల్‌గా ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక వీకెండ్స్ కాబట్టి కలెక్షన్లు ఎలా వస్తాయి అనేది వేచి చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : Bigg Boss7: ఈ సారి అంతా ఉల్టా పుల్టా అంటున్న నాగార్జున న్యూ ప్రోమో రిలీజ్

Next Story

Most Viewed