Bigg Boss7: ఈ సారి అంతా ఉల్టా పుల్టా అంటున్న Nagarjuna New Promo Release..

by Disha Web Desk 6 |
Bigg Boss7: ఈ సారి అంతా ఉల్టా పుల్టా అంటున్న Nagarjuna New Promo Release..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగులో స్టార్ మాలో ప్రసారమయ్యే బిగ్‌బాస్ రియాలిటీ షోకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకుని దూసుకుపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ షోను చూసేందుకు అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. త్వర‌లోనే 7వ సీజ‌న్ ప్రారంభం కానుంది. ఇటీవల విడుదలైన ప్రోమో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

తాజాగా, మరో ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఓ ప్రేమ జంట రాధా, ర‌మేశ్‌. ఇందులో ప్రియుడు ర‌మేశ్ ఓ కొండ‌పై నుంచి ప‌డిపోతుండ‌గా రాధ త‌న చున్నీ ఇచ్చి ప‌ట్టుకోమ‌ని చెబుతుంది. అత‌డు ప‌ట్టుకుంటాడు. కాగా.. ఇది కింగ్ నాగార్జున న‌చ్చలేదు. ఇలాంటి క్లైమాక్స్‌లు మ‌నం ఎన్నో చూశాం. ఇది అంతం కాదు ఆరంభం అంటూ చిటికేస్తాడు. అంతే రాధ‌కు తుమ్ము రావ‌డంతో ఆమె చున్నీని వ‌ధిలేస్తుంది. ర‌మేశ్ కొండ‌పై నుంచి కింద‌కు ప‌డిపోతూ ఉంటాడు. వెంట‌నే నాగ్‌.. ఎవ్వరి ఊహ‌కు అంద‌ని సీజ‌న్. బిగ్‌బాస్ సీజ‌న్ 7 అంతా ఉల్టా పుల్టా అని చెబుతాడు. చూస్తుంటే ఈ సారి సీజ‌న్‌ను స‌రికొత్త‌గా ప్లాన్ చేశార‌ని అనిపిస్తోంది. సెప్టెంబ‌ర్ 3 ఈ సీజ‌న్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ బిగ్‌బిస్ సీజన్-7 ఈసారి ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Next Story

Most Viewed