- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెట్లోనే చిరంజీవి నాపై కోప్పడ్డారు.. కోట శ్రీనివాసరావు కామెంట్స్ వైరల్
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గురించి అందరికి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గురించి అందరికీ తెలిసిందే. ఎటువంటి పాత్రలో అయిన ఓదిగిపోయి నటించే ఆయన.. ప్రస్తుతం వయసు మీద పడటంతో సినిమాలను పూర్తిగా తగ్గించేశారు. చాలా గ్యాప్ తర్వాత ఓ తెలుగు వెబ్ సిరీస్‌లో కనిపించిన కోట.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ జీవితం, పర్శనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో నాపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. షూటింగ్‌కు వెళ్లినప్పుడు తాగి వెళితే డైరెక్టర్ నన్ను కొట్టారని, ఎవరో అమ్మాయిని ఏడిపిస్తే ఆమె నన్ను కొట్టిందని, నిత్యం తాగుతూనే ఉండేవాడినని ఇలాంటి రూమార్స్ ఎన్నో వచ్చాయి. నేను తాగను అని చెప్పడం లేదు కానీ.. షూటింగ్‌లకు సంబంధించినంత వరకు చాలా జాగ్రత్తగా ఉంటా. ఒకేవేళ నేను కరెక్ట్‌గా ఉండక పోతే ఇన్ని సినిమాలు చేసేవాడిని కాదు కదా. పెద్దగుమ్మడి కాయంత టాలెంట్ ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఆ రెండూ ఉన్నవాడే కోట. ఒకసారి మాత్రం షూటింగ్‌కు వెళ్లినప్పుడు నా షూట్ లేదు అన్నారు. దీంతో ఎమ్మెస్ వత్తిడి చేస్తే సెట్లోనే కాస్త మందు తీసుకున్నా. కానీ నన్ను వెంటనే షూట్ ఉందని పిలిచారు. నేను షూట్‌కి మద్యం సేవించి వచ్చానని చిరంజీవికి తెలిసి.. ఎంతో టాలెంట్ పెట్టుకుని ఇలా చేస్తే, కెరియర్ దెబ్బతింటుందంటూ నా మంచి కోరి ఆయన నా మీదా కోప్పడ్డారు’’ అంటూ చెప్పుకొచ్చారు కోట శ్రీనివాసరావు.
Read more : రాజమౌళితో కూడా మహేష్ ఇలా చేస్తే కష్టమే? హీరో విదేశీ టూర్‌లపై చర్చ
భారీ ఆఫర్ కొట్టేసిన Sreeleela.. ఆ స్టార్ హీరోయిన్ పక్కన పెట్టి మరీ Ram charan సినిమాలో ఛాన్స్..!






