అభిమానులకు Megastar Chiranjeevi Surprise

by GSrikanth |   (  Updated:2023-01-21 14:20:20  IST  )

మెగాస్టార్ చిరంజీవి మరికాసేపట్లో తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఇన్ స్టాగ్రామ్ వేదికగా చిన్న సర్ ప్రైజ్ షేర్ చేసుకోబోతున్నట్టు ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

అభిమానులకు Megastar Chiranjeevi Surprise
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెగాస్టార్ చిరంజీవి మరికాసేపట్లో తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఇన్ స్టాగ్రామ్ వేదికగా చిన్న సర్ ప్రైజ్ షేర్ చేసుకోబోతున్నట్టు ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీంతో చిరంజీవి చెప్పబోయే సర్ ప్రైజ్ ఏంటనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో చిరంజీవి ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నాయి. తన కుమారుడు రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడనే శుభవార్తను చిరంజీవి రెండు రోజుల క్రితం వెల్లడించారు. స్వయంగా చిరంజీవి చెప్పిన ఈ గుడ్ న్యూస్ మెగా అభిమానుల్లో సంతోషం వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ మెగాస్టార్ చెప్పబోయే మరో సర్ ప్రైజ్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. కాగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కాబోయేది. మరో వైపు ఏపీలో చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ రాజకీయంగా మరింత యాక్టివ్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవి జనసేనకు మద్దతు ప్రకటిస్తారనే చర్చ కూడా చాలా కాలంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి చెప్పబోయే సర్ ప్రైజ్ రాజకీయాలకు సంబంధించినదా? లేక మూవీ అప్ డేట్ ఏదైనా ఇవ్వబోతున్నారా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

ఇవి కూడా చదవండి :...

1.ఇది నాకు సెంటిమెంట్ థియేటర్: Nandamuri BalaKrishna

2.దీపిక డ్రెస్సింగ్‌ అసభ్యకరంగా ఉంది: హోంమంత్రి షాకింగ్ కామెంట్స్..

Next Story