ఘనంగా ప్రారంభమైన చిలక ప్రొడక్షన్స్ నంబర్ 2 సినిమా

by Disha Web Desk 7 |
ఘనంగా ప్రారంభమైన చిలక ప్రొడక్షన్స్ నంబర్ 2 సినిమా
X

దిశ, సినిమా : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో చిలక ప్రొడక్షన్స్ నంబర్ 2గా వస్తున్న సినిమా ఘనంగా ప్రారంభమైంది. తెలుగు సంవత్సరాది సందర్భంగా ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన మేకర్స్.. చిత్ర ప్రారంభ వేడుకను కూడా నిర్వహించారు. ఈ మేరకు తరుణ్ భాస్కర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, సురేష్ బాబు క్లాప్ కొట్టారు. ఫస్ట్ షాట్‌కు నాగ్ అశ్విన్ డైరెక్షర్‌గా వ్యవహరించారు.

జెమినీ కిరణ్, శరత్ మరార్ స్క్రిప్ట్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న చిత్రం.. ప్రేక్షకులను అలరిస్తుందంటూ మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే ఏప్రిల్ 10 నుంచి షెడ్యుల్ స్టార్ట్ అవుతుందని తెలిపిన మేకర్స్.. అందరికీ నచ్చేలా సినిమాను రొపొందిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి:

మే 18న వస్తున్న ‘సామజవరగమన’


Next Story