మే 18న వస్తున్న ‘సామజవరగమన’

by Chukka Sudharani |   (  Updated:2023-03-22 15:37:13  IST  )

శ్రీవిష్ణు, రామ్ అబ్బరాజు కాంబోలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్ ‘సామజవరగమన’.

మే 18న వస్తున్న ‘సామజవరగమన’
X

దిశ, సినిమా: శ్రీవిష్ణు, రామ్ అబ్బరాజు కాంబోలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించారు. రెబా మోనికా జాన్ కథానాయికగా నటించిన సినిమాను మే 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ చాలా ప్లజంట్‌గా ఉంది.

ఇక శ్రీవిష్ణు తన కుటుంబంలోని ఆడవాళ్లతో కలిసి సరదాగా కనిపించగా.. ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కి ప్రేక్షకులనుంచి భారీ రెస్పాన్స్‌ వస్తోంది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకముందని, తమ సినిమాను ఆదరించి బిగ్ హిట్ చేయాలని కోరారు దర్శకనిర్మాతలు.

ఇవి కూడా చదవండి:

గ్రాండ్‌గా లాంచ్ అయిన వి.యఫ్.సి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం

Next Story