- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరోయిన్ తో చైతూ షికార్లు.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నSamantha అభిమానులు..
టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మధ్య ఏదో నడుస్తుంది అన రూమర్స్ చాలా రోజుల నుంచి మనం వింటున్నవే.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మధ్య ఏదో నడుస్తుంది అన్న రూమర్స్ చాలా రోజుల నుంచి మనం వింటున్నవే. ఈ ఇద్దరు ఇప్పటికే తమ మధ్య అలాంటిదేమీ లేదని చాలా సార్లు చెప్పినప్పటికీ.. ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఆ మధ్య శోభితా హైదరాబాద్ వచ్చిన సమయంలో మొత్తం చైతూ వెంటే ఉన్నదని, అతను కొత్తగా కడుతున్న ఇంటికి కూడా వెళ్లిందని వార్తలు వచ్చాయి. ఇక ఈ సమయంలో తాజాగా, మరోసారి వీరిద్దరు మళ్లీ కలిసి ఒకే ఫ్రేమ్ లో జంటగా కనిపించడంతో, పుకార్లు మళ్లీ జోరందుకుంటున్నాయి. ఈ ఫొటో లండన్‌లో దిగినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరి నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇలా కలిసి ఫొటోలకు పోజులిచ్చారని సినిమా ఇండస్ట్రీ టాక్. ఏదేమైనప్పటికీ, ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో సమంత ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. సామ్, చై విడిపోయినప్పుడు అందరూ సమంతనే కారణం అని నిందించారు. ఇప్పుడు చూస్తే చైతన్య మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడని వాళ్లు తిట్టిపోస్తున్నారు.
Read more:






