చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టు కొట్టిన " Masooda Movie "

by Disha Web Desk 10 |
చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టు కొట్టిన  Masooda Movie
X

దిశ, వెబ్ డెస్క్ : 'స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్' పతాకం‌పై వచ్చిన మూడో సినిమా " మసూద ". ఈ సినిమాలో " గంగోత్రి " లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్ లీడ్ రోల్ చేయగా , సంగీత, తిరువీర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో..సినిమా‌పై కూడా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా నవంబర్ 18 న విడుదలయ్యింది. ఈ సినిమా ఆరు రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం - 0.95 L

సీడెడ్ - 0.45 L

ఆంధ్ర - 0.98 L

ఏపీ + తెలంగాణ - 02.38 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 0.11 L

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 02.49 Cr

ఈ సినిమాకు రూ.1.25 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొత్తానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌‌ సాధించి హిట్ కొట్టి బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకెళ్తుంది. మొదటి రోజు మొదటి షో నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో..ఈ సినిమా మూడో రోజు బ్రేక్ ఈవెన్ సాధించడమంటే మాములు విషయం కాదు. " మాసూద " సినిమా ఆరు రోజుల్లో రూ.2.49 కోట్లను కలెక్టు చేసింది. ఈ సినిమాను కొన్న బయ్యర్స్ లాభాల బాట పట్టారు. " మసూద " చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది.

" గాలోడు " సినిమాతో హిట్టు కొట్టేసిన సుడిగాలి సుధీర్

Next Story

Most Viewed